ఒకే ఫ్యామిలీలో 22 మందికి కరోనా

శివాన్​ (బీహార్​): బీహార్​లో మొత్తం కేసుల్లో మూడో వంతు కేసులు ఒకే ఫ్యామిలీ నుంచి రికార్డయ్యాయి. శుక్రవారం నాటికి ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 60. స్టేట్ క్యాపిటల్ పాట్నాకు130 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివాన్​ జిల్లా పంజ్​వార్​ విలేజ్​లో ఒకే ఫ్యామిలీలో 22 మందికి కరోనా పాజిటిల్ తేలడం కలకలం రేపుతోంది. గత నెలలో ఈ కుటుంబానికి చెందిన వ్యక్తి ఒమన్ నుంచి తిరిగొచ్చాడు. అతడికి కరోనా పాజిటివ్​ తేలింది. ఆలోపే ఆ ఫ్యామిలీలోని 22 మందికీ కరోనా అంటుకుంది. వీరిలో మహిళలు, చిన్నారులూ ఉన్నారు. గ్రామంలోని మరో ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. ఆ ఫ్యామిలీలో ప్రస్తుతానికి నలుగురు కోలుకున్నారు. అయినా వారిని మరో రెండు వారాలు క్వారంటైన్​లో ఉంచనున్నారు. మార్చి 16 న ఒమన్ నుంచి వచ్చిన సదరు వ్యక్తి ఏప్రిల్ 4 వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగినట్టు అధికారులు గుర్తించారు. అతడికి దగ్గరగా మెలిగిన వాళ్లను అధికారులు ట్రేస్​ చేస్తున్నారు. పంజ్​వార్​ విలేజ్​ప్రాంతంతోపాటు అతడు తిరిగిన మరో 43 గ్రామాలను అధికారులు నిర్బంధించారు. సివాన్​జిల్లాలో ఇప్పటివరకు 31 కరోనా వైరస్ కేసులు నమోదయ్యారు. ఈ సంఖ్య రాష్ట్రం మొత్తం కేసుల్లో సగం.

Latest Updates