ప్రతీ ఐదుగురు మహిళల్లో ఒకరికి ఎఫైర్..

ఇంగ్లండ్: ప్రతీ ఐదుగురు మహిళల్లో ఒకరికి ఎఫైర్ ఉందని తెలిపింది ఇంగ్లండ్ లోని ‘ఫిమేల్’ మ్యాగజిన్. ‘సెక్స్ అండ్ రిలేషన్ షిప్’ పై చేసిన సర్వేలో ఊహించని వివరాలు తెలిశాయని తెలిపింది. అయితే వేరే వాళ్లతో శారీరకబంధాన్ని పెట్టుకున్న మహిళలు తన భర్తను, కుటుంబాన్ని వదిలివేయమని తెలిపారని చెప్పింది. ప్రస్తుతం తాను సమాజంలో ఉంటున్న హోదా తన కుటుంబం వల్ల వచ్చిందేనని దాన్ని వదులుకోవడానికి సిద్దంగా లేమని అన్నారని తెలిపింది. అయితే ఆ మహిళలపై 50శాతం మంది భర్తలకు అనుమానం లేదని చెప్పింది. ఎవరితోనైతే వివాహేతర సంబంధం పెట్టుకున్నారో ఆమగవారికి కూడా తాము మోసపోతున్నామని తెలియదని తెలిపింది ‘ఫిమేల్’ అనే మ్యాగజైన్.

ఈ వివాహేతర సంబంధాలు ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న మహిళలో జరుగుతుందని ‘ఫిమేల్’ మ్యాగజైన్ తెలిపింది. ఉద్యోగ నిమిత్తం వేరే నగరాలకు వెళ్లినపుడు మగవాళ్లతో పనిచేయవలసి వస్తుందని ఆయా పరిచయాలు శారీరక సంబంధాలకు దారితీశాయని లండన్‌కు చెందిన 38 ఏళ్ల రాచెల్‌ మోర్గాన్‌ తెలిపారు.

Latest Updates