వీడియో: దసరా పండుగ ఉత్సవాల్లో అపశ్రుతి

రావణ వధ సమయంలో మంటలు అంటుకొని ఒకరికి తీవ్ర గాయాలు
జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్‌‌లో దసరా పండుగ సందర్భంగా ఆదివారం రాత్రి రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో అనుకోకుండా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్న వారందరూ దూరంగా పారిపోగా.. భవానీ మాలధారణలో ఉన్న యశ్వంత్ అనే వ్యక్తికి మంటలు అంటుకున్నాయి. యశ్వంత్‌‌కు తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే స్థానికులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రెండు వర్గాలకు మధ్య ఘర్షణ జరగడంతో జరిగిన ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Latest Updates