దారుణం : ఇంజినీరింగ్ అమ్మాయిని ఇంట్లోనే తగలబెట్టాడు

కేరళ రాష్ట్రంలో దారుణం జరిగింది. త్రిసూర్ లోని చియ్యారంలో ఓ అమ్మాయిని వాళ్ల ఇంట్లోనే అత్యంత దారుణంగా చంపేశాడు ఓ దుండగుడు. హత్య చేసి పారిపోతున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

చియ్యారంలో ఒల్లుకవు భవిత గుడి దగ్గర అత్తమ్మ, నానమ్మతో కలిసి ఉంటోంది 21 ఏళ్ల నీతూ. కొడకరలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. నీతూ తల్లి కొన్నేళ్ల కిందట చనిపోయింది. ఆమె తండ్రి మరో పెళ్లి చేసుకుని వేరేగా ఉంటున్నాడు. ఇంట్లో నీతూ, ఆమె అమ్మమ్మ మాత్రమే ఉన్న టైమ్ లో దారుణం జరిగింది.

వడక్కేకడ్ ప్రాంతానికి చెందిన నిధీష్… ఇంటి వెనుక నుంచి ఇంట్లోకి దూరాడు. నీతూను కత్తితో కడుపులో పొడిచాడు. ఆ తర్వాత తన వెంట తీసుకొచ్చిన పెట్రోల్ ను ఆమెపై పోసి నిప్పంటించాడు. అసహాయ స్థితిలో ఉన్న అమ్మమ్మ ఏమీ చేయలేకపోయింది. నీతూ అరుపులు విని చుట్టుపక్కల ఉన్నవాళ్లు అక్కడకు పరుగెత్తుకొచ్చారు. కానీ అప్పటికే నీతూ సజీవ దహనం అయిపోయింది. అమ్మాయిని చంపేసి ఇంటి నుంచి పారిపోతున్న దుండగుడు నిధీష్ వారి నుంచి తప్పించుకోబోయాడు. స్థానికులు వెంబడించి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎందుకు చంపేశాడు.. అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్రిసూర్ మెడికల్ కాలేజీకి అమ్మాయి బాడీ తరలించారు పోలీసులు. స్థానికంగా ఈ సంఘటన సంచలనం రేపింది.

నడిరోడ్డుపై అమ్మాయికి నిప్పు

రెండు వారాల కిందట కేరళలోని పథనంతిట్ట జిల్లాలో ఇలాంటి సంఘటనే తీవ్రమైన అలజడి రేపింది. కవిత అనే20 ఏళ్ల అమ్మాయిని.. అజిన్ రెజీ మాథ్యూ అనే వ్యక్తి పట్టపగలే తగలబెట్టాడు. మార్చి 12న ఈ దారుణం జరిగింది. ఇంటి నుంచి కాలేజీకి వెళ్తున్న టైమ్ లో ఆమెను అడ్డగించి.. ఒంటిపై నిప్పు పెట్టాడు ఆ యువకుడు. 65 శాతం కాలిన గాయాలతో ఆమె హాస్పిటల్ పాలైంది. 8 రోజుల పాటు ట్రీట్ మెంట్ తర్వాత చనిపోయింది.

 

 

 

Latest Updates