మారుతి వ్యాన్, ఆల్టో కారు ఢీ.. ఒకరు మృతి

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అగపల్లి వద్ద సాగర్ రోడ్డుపై  ప్రమాదం జరిగింది. మారుతి వ్యాన్, ఆల్టో కార్  ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. 8 మందికి గాయాలయ్యాయి. మృతుడు యాచారం మండలం తులేకుర్డు గ్రామానికి చెందిన చంద శ్రీనివాస్(40) గా గుర్తించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.

Latest Updates