యాదాద్రి భువనగిరిలో బావిలోకి దూసుకెళ్లిన కారు…ఒకరి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇవాళ( సోమవారం) ఓ కారు వేగంగా వెళ్లి బావిలో పడిందిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరొకరు గాయాలతో బయటపడ్డారు. వలిగొండ మండలం వేములకొండ క్రాస్ రోడ్ లో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్, మరొకరు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్తూ అదుపు తప్పి పడిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే ఒకరు చనిపోయారు. మరొకరిని పోలీసులు రక్షించారు. చనిపోయిన వ్యక్తిని చౌటుప్పల్‌ మండలం అల్లందేవి చెరువు వాసిగా గుర్తించారు. లాక్‌డౌన్ కారణంగా రోడ్లు ఖాళీగా ఉండడంతో కొందరు మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్నారని తెలిపారు పోలీసులు.

Latest Updates