రాజేంద్రనగర్ పేలుడులో గాయపడిన వ్యక్తి మృతి

రాజేంద్రనగర్ పేలుడులో గాయపడిన వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఉదయం రాజేంద్రనగర్ లో చెత్త ఎరుకునే వ్యక్తి ఓ బాక్స్ ను ఓపెన్ చేయడంతో పేలుడు జరిగింది. పేలుడుతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో పాటు అక్కడ పార్క్ చేసి ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. క్లూస్ టీం సేకరించిన ఆధారాలను.. FSLకి పంపించారు పోలీసులు. పేలుడుకు కెమికల్ పదార్ధాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పేలుడు జరిగిన ప్రదేశాన్ని డీసీపీ ప్రకాశ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్, సీపీ సజ్జనార్ పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్, ఆక్టోపస్ బృందాలతో దర్యాప్తు చేస్తున్నామన్నారు సీపీ సజ్జనార్.

Latest Updates