అయ్యో పాపం..! ఏనుగు కింద నలిగి చనిపోయాడు

కేరళ : పాలు పోసి పెంచితే అదే పాము కుట్టి చంపిందని కథల్లో విన్నాం. ఇపుడు కేరళలోని కొట్టాయంలో అలాంటిదే ఓ దారుణం జరిగింది. ఐతే.. ఇక్కడ ఓ ఏనుగు తనకు స్నానం చేయిస్తున్న ఓ పిల్లాడి ప్రాణం తీసింది. ఏనుగు వెనుక వైపు నిలబడి పైపుతో దానిపై నీళ్లు కొడుతున్నాడు ఆ పిల్లాడు. ఏనుగు సడెన్ గా ఎడమవైపు ఒరుగుతూ కూర్చుండిపోయింది. అక్కడే ఉన్న పిల్లాడి కాలు ఇరుక్కుపోయి ఏనుగు కింద ఉండిపోయాడు. ఏనుగు పూర్తిగా పక్కకు వంగి కూర్చోవడంతో.. పాపం అతడు దానికిందే నలిగిపోయాడు. మరో యువకుడు వచ్చి దానిని బెదరగొట్టినా..  అది సమయానికి లేవలేదు. ఆ తర్వాత.. చాలాసేపు అలాగే ఉండిపోవడంతో పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు.

Latest Updates