క‌రోనా లక్షణాలతో మృతి: డెడ్ బాడీ కోసం డాక్ట‌ర్ల‌పై దాడి

సికింద్రాబాద్ గాంధీ హాస్పిట‌ల్ లో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో ట్రీట్ మెంట్ తీసుకుంటూ బుధ‌వారం ప్రాణాలు కోల్పోయాడు. అయితే డెడ్ బాడీ అప్ప‌గించ‌లేద‌న్న కోపంతో మృతుడి బంధువులు డాక్ట‌ర్ల‌పై దాడి చేసిన‌ట్లు తెలిపారు గాంధీ హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్ శ్ర‌వ‌ణ్.

సేమ్ వార్డులో చికిత్స పొందుతున్న‌ మృతుడి సోద‌రుడు డాక్ట‌ర్ల‌పై దాడి చేయ‌డం స‌రికాద‌న్నారు. ప్రాణాలు ప‌ణంగా పెట్టి వైద్యం చేస్తున్న డాక్ట‌ర్ల‌పై దాడుల‌ను ఖండిస్తున్న‌ట్లు హెల్త్ మినిష్ట‌ర్ ఈట‌ల రాజేంద‌ర్ కూడా ఖండించార‌ని తెలిపారు గాంధీ హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్ శ్ర‌వ‌ణ్.

Latest Updates