తప్పిపోయిన పిల్లాడి ఆచూకీ చెప్పిన తెలంగాణ ‘దర్పణ్’

హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు రూపొందించిన ఫేస్ రికగ్నిషన్ టూల్ – దర్పణ్ మరో ఇంట ఆనందం నింపింది. ఆరునెలల కింద మధ్యప్రదేశ్ లో తప్పిపోయిన ఓ బాలుడిని.. బెంగళూరులో పట్టించింది. 14 ఏళ్ల బాలుడు సల్మాన్ షేక్… మధ్యప్రదేశ్ .. ఉజ్జయిని లోని.. చీమన్ గంజ్ మండి పీఎస్ పరిధిలో ఉండేవాడు. కాస్త మతిస్థిమితం లేని అతడు… చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. నానమ్మ దగ్గరే పెరుగుతున్నాడు. జూన్ 2018లో సల్మాన్ షేక్ తప్పిపోయాడు.

తప్పిపోయిన వారి ఆచూకీని వెతికే టీమ్.. దేశవ్యాప్తంగా తిరుగుతూ హైదరాబాద్ కు వచ్చారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా… డిసెంబర్ 25న పోలీసులు ఫేస్ రికగ్నిషన్ టూల్- దర్పణ్ ను ఉపయోగించారు. అప్పటికే తమ వద్ద నమోదై ఉన్న డేటా సాయంతో.. ఆ బాలుడి ఆచూకీని హైదరాబాద్ పోలీసులు కనిపెట్టారు. బెంగళూరులోని ప్రభుత్వ బాలుర ఆశ్రమంలో ఉన్నట్టుగా బాలుడి జాడ తెలిసింది. ఆ ఆశ్రమం ఇంచార్జ్ లలితను హైదరాబాద్ పోలీసులు కాంటాక్ట్ అయ్యారు. ఆమె బాలుడి వివరాలను కన్ ఫామ్ చేసింది. వెంటనే పోలీసులు మధ్యప్రదేశ్ లో కంప్లయింట్ నమోదై ఉన్న చీమన్ గంజ్ పీఎస్ కు కాంటాక్ట్ అయ్యారు. మండి స్టేషన్ ఎస్ హెచ్ ఓ అరవింద్ తోమర్ .. తప్పిపోయిన బాలుడి వివరాలను సరిపోల్చి ధ్రువీకరించారు. దీంతో… పోలీసులు బాలుడి సంరక్షకులను తీసుకుని బెంగళూరు వెళ్లారు. బాలుడిని ఆ కుటుంబంతో కలిపారు. ఆరు నెలల తర్వాత మళ్లీ తమకు దొరకడంతో బాధితులు సంతోషపడ్డారు.

దర్పణ్ సహాయంతో ఇప్పటికి 17 మంది తప్పిపోయిన వారి ఆచూకీ కనిపెట్టామని ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా చెప్పారు. నేర పరిశోధన, దర్యాప్తులో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రాధాన్యత ఎంతో ఉందని ఆమె అన్నారు.

Latest Updates