ఆ కుటుంబాన్ని డెంగీ ఇంకా వదలట్లే

  • ఇప్పటికే నలుగురి మృతి
  • రాజగట్టు తండ్రికీ సోకినట్లు నిర్ధారణ

మంచిర్యాల, వెలుగు: ఆ కుటుంబాన్ని డెంగీ వ్యాధి వెంటాడుతోంది. ఇప్పటికే నలుగురి మృతితో కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు. మంచిర్యాల శ్రీశ్రీనగర్ కు చెందిన గుడిమల్ల రాజగట్టు, అతని తాత లింగయ్య, కూతురు శ్రీవర్షిని, భార్య సోని డెంగీతో చనిపోవడం తెలిసిందే. ఇప్పుడు రాజగట్టు తండ్రి రాజయ్య (50)కి సైతం డెంగీ సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందిన విషయం వెలుగులోకి రావడంతో వైద్య సిబ్బంది గత నెల 29న మిగతా కుటుంబ సభ్యుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. జిల్లా హాస్పిటల్ లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో టెస్ట్ చేశారు. ఈ పరీక్షల్లో రాజయ్యకు డెంగీ నిర్ధారణ అయ్యింది. మరోవైపు రాజగట్టు పెద్ద కొడుకు శ్రీవికాస్​కు టైఫాయిడ్ వచ్చింది. నాలుగు రోజుల వయస్సున్న సోని బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రైవేట్​హాస్పిటల్​లో చికిత్స అందిస్తున్నారు.

one more person of Ragagattu family Suffering from dengue

Latest Updates