ఇంటర్ ఫెయిల్ : మరొక విద్యార్థిని బలి

ఇంటర్ ఫెయిల్ కావడంతో పురుగుల మందు తాగిన విద్యార్థిని

20 రోజుల చికిత్స తర్వాత మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ఇంటర్ ఆత్మహత్య నమోదైంది. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సాయిల మానస ప్రాణం కోల్పోయింది. ఆమె వయస్సు 17 ఏళ్లు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఇటీవలే రాసింది. గత నెల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె ఫెయిల్ అయింది.

బాగా రాసినా కూడా ఫలితాలు ఫెయిలైనట్టు రావడంతో… ఆమె మనస్తాపానికి లోనయ్యింది. రిజల్ట్ వచ్చినరోజే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. ఆమెను కుటుంబసభ్యులు దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకొచ్చారు. గత ఇరవై రోజులుగా మానసకు చికిత్స అందించారు డాక్టర్లు. ఐతే… ట్రీట్ మెంట్ తీసుకుంటుండగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

 

Latest Updates