ఒకే రోజు సినిమా రిలీజ్.. మరో సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్

కొంతమంది హీరోలు ఒక సినిమా పూర్తికాగానే విశ్రాంతి కోసం ఎంతోకొంత సమయం విరామం తీసుకుంటారు. ఆ తర్వాత మరో సినిమా గురించి ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఒక హీరో మాత్రం ఆయన నటించిన సినిమా ఈ రోజు రిలీజ్ అవుతుండగానే, మరో సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ జరిగింది. అంటే ఆ హీరో ఎంత స్పీడుమీదున్నాడాదో అర్థమవుతుంది. ఇంతకీ ఎవరా ఆ హీరో అనుకుంటున్నారా..ఆయనే మన మాస్ హీరో విశాల్.

విశాల్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ‘యాక్షన్’ సినిమా ఈ రోజు విడుదలవుతుంది. ఆ సినిమా విడుదలకాకముందే ఆయన హీరోగా నటిస్తున్న మరో సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ జరిగిపోయింది. ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు హీరో విశాల్.  విశాల్ హీరోగా నటిస్తూ, విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ద్వారా ఆయన సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘చక్ర’ గా టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో విశాల్ సరసన రెజీనా కసాండ్రా, శ్రద్ధా శ్రీనాధ్ నటిస్తున్నారు. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు.

Latest Updates