హయత్ నగర్లో చిన్నవివాదం ప్రాణం తీసింది

హయత్ నగర్లో దారుణం జరిగింది.  కారును బైక్ ఢీ కొట్టడంతో మొదలైన చిన్న వివాదం ప్రాణం తీసింది. ప్రశాంత్, సతీష్ అనే ఇద్దరు ప్రయాణిస్తున్న కారును  శ్రీనాద్ అనే వ్యక్తి బైక్ తగిలింది. వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు శ్రీనాధ్ తో గొడవకు దిగారు. వీరు గొడవ పడుతుండగా అటుగా వెళ్తున్న  పరమేశ్వర్ ,రాజు అనే ఇద్దరు వ్యక్తులు గొడవను ఆపేందుకు  ప్రయత్నించారు. అయితే కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పరమేశ్వర్, రాజులను చితకబాది అదే కారులో బలవంతంగా తీసుకెళ్లారు. అయితే కొద్ది దూరం వెళ్లగానే  కారు బోల్తాపడింది. ఈ ఘటనలో పరమేశ్వర్ మృతి చెందగా. రాజు పరిస్థితి విషమంగా ఉంది. కారును అక్కడే వదిలేసి ప్రశాంత్, సతీష్ లు పరారయ్యారు.

see more news

విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత

మచిలీపట్నంలో కరోనా! రహస్యంగా ట్రీట్ మెంట్

బ్రిటన్‌ వైద్య ఆరోగ్య మంత్రికి కరోనా వైరస్‌

 

Latest Updates