మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం… వేరయిన తల, మొండెం

మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లాలో 161 నంబర్ హైవే మీద అల్లాదుర్గం మండలం రాంపూర్ వద్ద జరిగింది. పెద్ద శంకరంపేట మండలం ఉత్తులూర్ గ్రామానికి చెందిన దుర్గయ్య.. అల్లాదుర్గం మండల పరిధిలో ఉన్న రాంపూర్‌లోని రైస్ మిల్లులో పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం దుర్గయ్య తన మోటార్ సైకిల్ మీద రైస్ మిల్లుకు బయలుదేరాడు. మరి కొద్దిసేపట్లో రైస్ మిల్లుకు చేరుకుంటాడనగా ఎదురుగా వస్తున్న డోజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గయ్య తల తెగి ఎగిరి దూరంగా పడింది. సంఘటన స్థలంలో మొండెం, తల వేరువేరుగా పడి ఉండటం భయానకంగా కనిపించింది. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెల పెళ్లిళ్లు కాగా, కుమారుడి పెళ్ళి చేయాల్సి ఉంది. మృతుని భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అల్లాదుర్గం పోలీసులు తెలిపారు.

For More News..

లాక్‌డౌన్ రిలీఫ్: సిటీ రోడ్లపై గంటకు 40 వేల వాహనాలు

కరోనా మందు పేరుతో భార్య బాయ్ ఫ్రెండ్ కుటుంబంపై హత్యాయత్నం

వీడియో వైరల్: బెంగళూరులో వింత సప్పుడు

Latest Updates