అమెరికాలో కరోనాతో నిమిషానికి ఒకరు మృతి

వాషింగ్టన్: అమెరికాలో కరోనా మహమ్మారి నిమిషానికి ఓ ప్రాణాన్ని బలి తీసుకుంటోంది. దేశంలో కరోనా మరణాలు 1.50 లక్షలు దాటిపోయాయి. ప్రపంచ మొత్తంలో నమోదైన కరోనా మరణాలలో అమెరికాలోనే సగం కంటే ఎక్కువగా ఉన్నాయి. దేశంలో బుధవారం నాటికి మొత్తం 44,26,000కేసులు నమోదు కాగా 1,50,676 మంది కరోనాతో చనిపోయారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.

54 రోజుల్లో నే 50 వేల డెత్స్

యూఎస్ లో ఫిబ్రవరి 29న ఫస్ట్ కరోనా డెత్ నమోదైంది. ఏప్రిల్ 23 నాటికి 54 రోజుల్లోనే 50వేల మంది కరోనాకు బలైపోయారు. తర్వాత మే 27 నాటికే మరణాలు లక్ష దాటాయి. ఆ తర్వాత 63 రోజులకు మరో 50 వేలతో డెత్స్ 1.50 లక్షలు దాటాయి. అమెరికాలో పలు రాష్ట్రాల్లోనే మృతులు ఎక్కువగా ఉంటున్నారు. బుధవారం కాలిఫోర్నియాలో 197 మంది కరోనా వల్ల చనిపోయారు. ఫ్లోరిడాలో 216 డెత్స్ సంభవించాయి. అయితే బిజినెస్ లు, లాక్ డౌన్ రూల్స్ సడలింపుతో కేసుల తీవ్రత పెరిగిందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్ అజీడ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ మంగళవారం చెప్పారు. ఇప్పుడు మరింత జాగ్రత్త లు పాటించాలన్నారు.

కరోనా కట్టడిలో ఫెయిల్: ఎక్స్ పర్ట్స్

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో అమెరికా ఫెయిల్ అయిందని టాప్ ఇండియన్ అమెరికన్ ఫిజీషియన్, హార్వార్ గ్డ్ లోబల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ డాక్టర్ అనీశ్ ఝా అన్నారు. దేశంలో కరోనా మరణాలను ఆపేందుకు సరైన ప్రయత్నాలు జరగలేదన్నా రు. మరో 1.50 లక్షల డెత్స్ జరగకుండా ఆపడమే ఇప్పుడు మిగిలి ఉందన్నా రు. మరోవైపు  జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నిపుణులు కరోనాను కంట్రోల్ చేయడానికి అనుసరించాల్సిన చర్యలను సిఫార్సు చేశారు. కేంద్ర, రాష్ట్ర, లోకల్ స్థాయిలో ప్రత్యేక పాలసీ యాక్షన్లు తీసుకోవాలని సూచించారు. మిగతా దేశాల మాదిరిగా అమెరికాలో కరోనా కంట్రోల్ కానందున.. దీనిపై పోరును “రీసెట్” చేయాల్సిన టైం వచ్చిందని పేర్కొన్నారు. కాగా అమెరికా ప్రతినిధుల సభ మెంబర్ లూయీ గోమర్ట్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో బుధవారం ప్రెసిడెంట్ ట్రంప్ తో కలిసి ఎయిర్ ఫోర్స్ వన్ లో సొంత రాష్ట్రా నికి వెళ్లాల్సి ఉండగా ఆ ట్రిప్ క్యాన్సి ల్ చేసుకున్నారు.

చైనాలో మళ్లీ పెరుగుతున్న కేసులు

కరోనా వైరస్ ప్రారంభమైన చైనాలో పాజిటివ్ కేసులు మళ్లీపెరుగుతున్నాయి. మంగళవారం 101 కొత్త కేసులు నమోదు కాగా బుధవారం 105 కేసులు కన్ఫమ్ అయ్యాయని చైనీస్ నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. దేశంలో బుధవారం నాటికి 84,165 కేసులు కన్ఫామ్ అయ్యాయని, 4,630 డెత్స్ నమోదయ్యాయని కమిషన్ పేర్కొంది.

Latest Updates