ప్రతీ 12నిమిషాలకో కరోనా వైరస్ బాధితుడు మృతి

కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఇరాన్ లో ప్రతీ 12నిమిషాలకో ఓ కరోనా బాధితుడు మృతి చెందుతున్నట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పినట్లు ఐఆర్ఎన్ ఎస్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది.

గత కొద్ది రోజులుగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న టెహ్రాన్, ఇరాన్ ప్రావిన్స్ ల లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ  పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ హెడ్ కియానుష్ జహాన్ పూర్ తెలిపారు.

టెహ్రాన్‌లో ప్రస్తుతం కరోనా 13శాతం విస్తరిస్తుందని.. ఇస్ఫాహాన్, ఖోరాసన్ రజావి మరియు తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్సులు ఇటీవల పెరుగుతున్న ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఎక్కువ మరణాలు సంభవించినట్లు ఆయన తెలిపారు.

అంతకుముందు రోజు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ 24,811 మందికి వైరస్ సోకినట్లు ప్రకటించింది, వారిలో 1,934 మంది మరణించినట్లు తెలిపింది.

Latest Updates