చిన్నగొడవకే కత్తి దించాడు : అన్నపై దాడి

హైదరాబాద్ : ఇంట్లో జరిగిన గొడవ.. ఇద్దరు అన్నదమ్ముల మధ్య కత్తిపోట్లకు కారణమైంది. ఈ సంఘటన చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్య నగర్ లో జరిగింది.

తన అన్న మండల వెంకట వంశీ(22)ని కత్తితో పొడిచాడు తమ్ముడు.  ఆవేశంలో కత్తితో పొడవడంతో… ఆ తర్వాత తమ్ముడు అక్కడినుంచి పారిపోయాడు. కత్తి దాడిలో తీవ్రంగా గాయపడ్డ వంశీని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు కుటుంబసభ్యులు. నిందితుడిపై ipc 307 సెక్షన్లు పెట్టి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు చాదర్ ఘాట్ పోలీసులు.

Latest Updates