పెళ్లికి నో చెప్పిందని సూసైడ్ చేసుకున్నాడు..

నేరెడ్ మెట్, వెలుగు: పెళ్లికి నో చెప్పిందని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది.సీఐ నరసింహ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. నేరెడ్ మెట్ రేణుకా నగర్ లో ఉండేడి. సుశ్మ ఓ స్కూల్లో రిసెప్షనిస్ట్​గా పనిచేస్తోంది. నేరెడ్ మెట్ వినోభానగర్ లో నివసించే నంద కిశోర్ (32) ఏడాది కాలంగా పెళ్లి చేసుకోవాలని ఆమెను వేధిస్తున్నాడు . దాంతో సుశ్మ గత ఏడాది పోలీసులకు కంప్లేంట్ చేయడంతో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. జైలు నుంచి వచ్చిన నంద కిశోర్  ఇంటి ముందు శనివారం రాత్రి తనను పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తూ విషం తాగాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ లో గాంధీ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడని,బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.

 

Latest Updates