మాట్లాడదామని పిలిచి దాడి.. యువకుడు మృతి

సికింద్రాబాద్, వెలుగు: బైక్ యాక్సిడెంట్ విషయంలో యువకుల మధ్య జరిగిన గొడవ  ఒకరి ప్రాణం తీసింది.  చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్.ఎన్ నగర్​లో రెండ్రోజుల  కిందట నాసర్ వెహికల్​ను ఫైజల్(20) ఢీ కొట్టాడు. నాసర్ వెహికల్ ఖరాబ్ కావడంతో బుధవారం అతడు తన ఫ్రెండ్స్​ను తీసుకుని వచ్చి .. వెహికల్ ​విషయంలో మాట్లాడుదామని ఫైజల్ ను పిలిచాడు. నాసర్,ఫైజల్ మధ్య మాటామాటా పెరిగింది. నాసర్, అతడి ఫ్రెండ్స్ పిడిగుద్దులతో ఫైజల్ పై దాడి చేశారు. ఫైజల్ ​స్పృహ కోల్పోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం  అందుకున్న చిలకలగూడ పోలీసులు   ఘటనా స్థలానికి చేరుకొని నిందితులు నాసర్ , అతడి ఫ్రెండ్స్ హారబాస్, ఆరిఫ్, సోను, రహీంను అదుపులోకి తీసుకున్నారు. ఫైజల్ డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్​కి తరలించారు.

see more news

ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి బైక్ కొట్టేసిన్రు

రాజకీయ పార్టీలకు ‘‘సాగర్’’ సవాల్ ​

సీజ్ చేసిన పైసల్ని వడ్డీతో కలిపి కట్టండి

Latest Updates