త్వరలో ‘వన్ ప్రొడక్ట్ వన్ డిస్ట్రిక్ట్​ట్​’

న్యూఢిల్లీ: అన్ని జిల్లాల్లోనూ మాన్యుఫాక్చరింగ్‌‌ను ఎంకరేజ్‌‌ చేయడానికి త్వరలోనే ‘వన్ ప్రొడక్ట్ వన్ డిస్ట్రిక్ట్​’ ప్రోగ్రామ్‌‌ను ప్రకటిస్తామని కేంద్ర కామర్స్ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. ఈ ప్రోగ్రామ్ కింద దేశంలోని ప్రతి జిల్లా అక్కడ లభించే వనరులతో ప్రొడక్ట్‌‌లను తయారు చేయాలని పిలుపునిచ్చారు. వన్ ప్రొడక్ట్ వన్ డిస్ట్రిక్ట్​ ప్రోగ్రామ్ విషయంలో రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఈ ప్రోగ్రామ్‌‌ను లాంఛ్ చేస్తామని పేర్కొన్నారు. దీని ద్వారా దేశంలోని ప్రతి జిల్లా తాను ఎక్స్‌‌లెన్స్‌‌గా ఉన్న ప్రొడక్ట్‌‌లపై ఫోకస్ చేస్తాయని మంత్రి అన్నారు. ఇప్పటికే కామర్స్, ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ 24 ప్రొడక్ట్‌‌లను గుర్తించిందని, వచ్చే ఐదేళ్లలో వీటి ద్వారా మాన్యుఫాక్చరింగ్ అవుట్‌‌పుట్ రూ.20 లక్షల కోట్లకు పెరుగుతుందని అన్నారు.  ఇండియా తన ఎకనమిక్ యాక్టివిటీని విస్తరించుకోవచ్చని, ఉద్యోగాలు కల్పించవచ్చని  మంత్రి గోయల్‌‌ చెప్పారు.  ఈ ప్రొడక్టుల తయారీకి రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్రం, ప్రైవేటు సెక్టార్ ఇండస్ట్రీలతో కలిసి పనిచేయాలని సూచించారు. డిపార్ట్‌‌మెంట్‌‌ ఫర్‌‌ ఇండస్ట్రీ అండ్‌‌ ఇంటర్నల్‌‌ ట్రేడ్‌‌ (డీపీఐఐటీ) 27 చాంపియన్‌‌ సెక్టార్లను గుర్తించిందని, వీటిలో ఇన్వెస్ట్‌‌ చేసే వారికి ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. వీటిలో ఏరోస్పేస్‌‌, డిఫెన్స్‌‌, ఆటోమొబైల్​, క్యాపిటల్‌‌ గూడ్స్‌‌, లెదర్‌‌,   జ్యూయలరీ వంటివి ఉన్నాయి.

For More News..

మూడో రోజు తగ్గిన గోల్డ్ ధరలు

స్టూడెంట్లకు ఓయో డిస్కౌంట్లు

కొత్త బండ్లకు డిస్కౌంట్​ కావాలంటే ఇలా చేయాల్సిందే

Latest Updates