దేశంలో ప్రతి పదహారు నిమిషాలకో రేప్

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌‌లోని హత్రాస్ గ్యాంగ్ రేప్‌‌పై దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది దేశంలో నమోదైన రేప్‌‌ కేసుల సమాచారాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్‌‌బీ) వెల్లడించింది. ఎన్సీఆర్‌‌బీ రిపోర్ట్ ప్రకారం.. దేశంలో ప్రతి 16 నిమిషాలకు ఏదో ఒక చోట ఓ మహిళపై రేప్ జరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2019లో దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన క్రైమ్ కేసుల సంఖ్య 4,05,861 కాగా.. వీటిలో 32 వేలకు పైగా రేప్ కేసులు ఉన్నాయి. 2019లో దేశంలో ప్రతి రోజు 88 రేప్ కేసులు నమోదవ్వగా.. వీటిలో దళిత కమ్యూనిటీపై జరిగిన రేప్ కేసుల సంఖ్య 11 శాతం ఉండటం గమనార్హం. రాజస్థాన్ (6,000 కేసులు), ఉత్తర్ ప్రదేశ్‌‌ (3,065)లో అత్యధిక స్థాయిలో రేప్ కేసులు నమోదయ్యాయి.

Latest Updates