రాత్రి మొదలై ఇంకా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌.. ఒక ఉగ్రవాది హతం

జమ్మూ కశ్మీర్ లోని అవంతిపోరాలో మంగళవారం రాత్రి మొదలైన ఎన్‌కౌంటర్‌ ఇంకా సాగుతూనే ఉంది. అవంతిపోరాలోని షర్షాలి ఖ్రూ ప్రాంతంలో నిన్న రాత్రి ఎన్‌కౌంటర్‌ మొదలైంది. పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఒక ఉగ్రవాది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి ఇంకా కాల్పులు జరగుతున్నాయని.. అందుకే ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగిస్తున్నామని పోలీస్ అధికారి తెలిపారు.

ఉత్తర కాశ్మీర్‌లోని హంద్వారాలో ఆదివారం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఒక కల్నల్, ఒక మేజర్, ఒక పోలీసు అధికారి సహా ఐదుగురు భద్రతా దళ సిబ్బంది మరణించారు. అది మరవక ముందే మరోసారి ఉగ్రవాదుల కాల్పులు మొదలయ్యాయి.

For More News..

జైలులో మర్మాంగాలను కత్తిరించుకున్న ఖైదీ

కారులో బిడ్డను ప్రసవించిన గర్భవతి

Latest Updates