వారణాసి: 24మంది రైతుల నామినేషన్లు రిజెక్ట్

వారణాసి లోక్ సభ స్థానానికి 25మంది ఆర్మూర్ రైతులు నామినేషన్ వేయగా.. 24మంది నామినేషన్ లు రిజెక్ట్ అయ్యాయి. బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన సున్నం ఇస్తారి అనే రైతు వేసిన నామినేషన్ ఒక్కటే చెల్లు బాటైంది. అన్నీ సవ్యంగా ఉన్నా కావాలనే తమ నామినేషన్ లను వారణాసి ఎన్నికల అధికారులు తిరస్కరించారని ఆర్మూర్ రైతులు ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు ఈ నెల 3వ తారీకున ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. వారణాసిలో 119 మంది నామినేషన్ లు దాఖలు చేయగా..30మంది నామినేషన్ లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి.

Latest Updates