టిక్‌టాక్‌లో ప్రేమ.. యువకుడి ఆత్మహత్య

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ నటరాజ్ నగర్ లో సాయి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ యువతి తనపై చేసిన పోలీస్ కంప్లయింట్ తో భయపడి సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలుకు చెందిన ఓ అమ్మాయి… టిక్ టాక్ లో సాయికి పరిచయమైంది. ఆ తర్వాత.. పరిచయం ప్రేమగా మారింది. పలు సందర్భాల్లో ఇద్దరూ కలుసుకున్నారు. ఐతే… యువతికి సంబంధించిన గోల్డ్ చెయిన్ ను సాయి తీసుకున్నాడు. కానీ.. ఆ తర్వాత దానిని ఆమెకు తిరిగి ఇవ్వలేదు. తన బంగారు గొలుసును కాజేశాడంటూ.. ఆ అమ్మాయి కర్నూలులో పోలీసులకు కంప్లయింట్ చేసింది. హైదరాబాద్ లో ఉంటున్న సాయికి… కర్నూలు పోలీసులు కాల్ చేశారు. తనను ఎక్కడ పట్టుకుంటారోనని.. భయంతో గదిలో ఉరివేసుకొని సాయి ఆత్మహత్య చేసుకున్నాడని.. ఎస్సార్ నగర్ పోలీసులు చెప్పారు.

Latest Updates