వన్ ప్లస్ 7కు పోటీగా Redmi K20 Pro

బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ విడుదల చేస్తూ ఇండియా మార్కెట్లో టాప్ లో ఉన్న రెడ్ మీ.. తొలిసారిగా ప్రీమియం ఫోన్లను విడుదలచేసింది. ప్రీమియం ఫోన్ల కేటగిరీలో అగ్రస్థానంలో ఉన్న వ‌న్ ప్లస్‌ కు కూడా గట్టి పోటీ ఇచ్చేలా కొత్త మోడల్.. రెడ్‌మీ కె20 ప్రొను భార‌త మార్కెట్‌ లో విడుద‌ల చేసింది. ఫ్లాగ్‌షిప్ కిల్ల‌ర్ 2.0గా చెబుతున్న రెడ్‌మీ కె20 ప్రొ… వ‌న్‌ప్ల‌స్ 7, 7 ప్రొ ఫోన్ల‌కు గ‌ట్టిపోటీనిస్తుంద‌ని అనుకుంటున్నారు.

రెడ్‌మీ కె20 ప్రొ డిజైన్‌

రెడ్‌మీ కె20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో బార్డ‌ర్‌లెస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసింది. ముందు భాగంలో ఈ ఫోన్‌లో పాప‌ప్  సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫోన్‌లో 6.39 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే ఉండ‌గా, దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో ప్యానెల్‌కు కూడా ఇదే  ప్రొటెక్ష‌న్ ఉంది. అలాగే ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

రెడ్‌మీ కె20 ప్రొ స్మార్ట్‌ ఫోన్ మెట‌ల్ ఫ్రేమ్‌ను క‌లిగి ఉండ‌డంతో దీనికి ప్రీమియం లుక్ వ‌చ్చింది. ఈ ఫోన్‌కు ఎలాంటి వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ లేదు. కాక‌పోతే పీ2ఐ నానో కోటింగ్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల ఈ ఫోన్‌పై నీళ్లు ప‌డ‌గానే వాటంత‌ట అవే అవ‌త‌లికి వెళ్లిపోతాయి.

కెమెరా, ఇత‌ర ఫీచ‌ర్లు

రెడ్‌మీ కె20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్స‌ల్ రేర్ కెమెరా, 13 మెగాపిక్స‌ల్ కెమెరా , 8 మెగాపిక్స‌ల్ కెమెరా

ఈ 3 కెమెరాల‌తో తీసే ఫొటోలు, వీడియోలు క్వాలిటీగా ఉంటాయి

20 మెగాపిక్స‌ల్ పాప‌ప్ సెల్ఫీ కెమెరా

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 855 చిప్‌సెట్

6/8 జీబీ ర్యామ్‌

ఆండ్రాయిడ్ 9.0 పై

డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై

బ్లూటూత్ 5.0, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ

4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

బ్యాట‌రీ ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్

రెడ్‌మీ కె20 ప్రొ 6జీబీ ర్యామ్‌/128 జీబీ వేరియెంట్ ధ‌ర రూ.27,999

8జీబీ ర్యామ్‌/ 256 జీబీ వేరియెంట్ ధ‌ర రూ.30,999

ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోం స్టోర్‌ల‌ సేల్ లో ఉంది.

Latest Updates