
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ఛైర్మన్ ఎన్నిక టెన్షన్,టెన్షన్ గా కొనసాగుతోంది. కాంగ్రెస్, TRSలు రెండూ సమాన బలంతో ఉన్నాయి. నేరేడుచర్లలోని 15 వార్డులకు గాను కాంగ్రెస్‌కు-7, TRSకు-7, CPMకు ఒక స్థానం లభించాయి. కాంగ్రెస్ పార్టీకి CPM మద్దతు ప్రకటించింది.TRSకు ముగ్గురు ఎక్స్‌అఫిషియో సభ్యుల మద్దతు ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కెవిపిల మద్దతు ఉంది. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు వేయడానికి కెవిపికి ఎన్నికల కమిషన్ అనుమతి మంజూరు చేసింది. రెండు పార్టీలు చెరో 10 ఓట్లతో సమాన బలంతో ఉన్నాయి. దీనితో ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది.