ఇద్దరు విద్యార్థునుల మిస్సింగ్ పై కొనసాగుతున్న సస్పెన్స్

కరీంనగర్ జిల్లా : జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ఇద్దరు విద్యార్థునుల మిస్సింగ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. సామ కృష్ణ శ్రీ, సామ వైష్ణవి అనే ఇద్దరు స్టూడెంట్స్  కనిపించకుండా పోవడంపై పోలీసులు… సీసీ  ఫుటేజ్ ఆధారంగా వెతుకుతున్నారు.  వీళ్ళ తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్థిరపడ్డారు.  స్కూళ్ళకి సెలవులు కావడంతో… తల్లితో కలసి ఈ ఇద్దరూ వావిలాలలో నానమ్మ ఇంటికి వచ్చారు.  సోమవారం ఉదయం… కుటుంబ సభ్యులు పత్తి ఏరడానికి వెళ్ళారు. అప్పుడు తాతతో కలసి ఇంటి దగ్గరే ఉన్న కృష్ణశ్రీ, వైష్ణవి… బంధువుల ఇంటికి వెళ్ళొస్తామని బయటకు వెళ్ళారు.

సాయంత్రం 7 గంటల నుంచి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనలో ఉన్నారు. అయితే మధ్యాహ్నం మూడింటి సమయంలో గుంపుల క్రాస్ రోడ్డు దగ్గర ఆటో ఎక్కి… జమ్మికుంట వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. స్టూడెంట్స్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Latest Updates