హైదరాబాద్ లో ఉల్లి ధర రికార్డ్

హైదరాబాద్ లో ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా  ఉల్లి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి.. బహిరంగ మార్కెట్ లో కేజీ రూ.120 నుంచి రూ.150 పలుకుతుంది. అకాల వర్షాలతో ఉల్లి పంట దెబ్బతినడంతో మహారాష్ట్ర , కర్నూల్ ,మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ మలక్ పేట్ మార్కెట్ కు ఉల్లి ఆశించిన స్థాయిలో రాక పోవడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. మాములుగా రోజు లక్ష బస్తాల ఉల్లి వస్తే…ప్రస్తుతం 5 వేల బస్తాలు కూడా రావడం లేదు. ఉల్లి పంట తగ్గడం , సరఫరా లేక పోవడంతో ధర విపరీతంగా పెరుగుతోంది.

మలక్ పేట్ హోల్ సేల్ మార్కెట్లో క్వింటల్ ఉల్లి రూ.15 వేలు పలికింది.30 ఏళ్ళ మలక్ పేట్ మార్కెట్ చరిత్ర లో రైతుకు కేజీకి రూ. 150 రూపాయలు దక్కడం ఇదే మొదటి సారి.దీంతో  రిటైల్ మార్కెట్ లో  రూ.120 నుంచి రూ. 150లకు చేరింది.

Latest Updates