అక్కడ 5 కేజీల ఉల్లిగడ్డలు రూ. 100కే..

దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఉల్లి లోల్లి చేస్తోంది. ఆకాశాన్నంటిన ధరలతో ఉల్లి కోయకుండానే కన్నీళ్ళు తెప్పిస్తోంది. ఇప్పటికే కేజీ ఉల్లి రూ. 200 మార్కుదాటి కాకరేపుతోంది. దాంతో ఉల్లికి దేశవ్యాప్తంగా బాగా గిరాకీ పెరిగింది. కానీ, తమిళనాడులోని కడలూరులో మాత్రం ఉల్లి చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కేజీ ఉల్లిగడ్డ 20 రూపాయలకే అందిస్తున్నారు స్థానిక రైతులు. వారు పండించిన ఉల్లిని రైతులే నేరుగా రైతు బజార్‌కు తీసుకొచ్చి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. 5 కేజీల ఉల్లిగడ్డను కేవలం 100 రూపాయలకే అమ్ముతున్నారు. దాంతో ప్రజలు ఎగబడి కొంటున్నారు.