ఈడీ కస్టడీలో ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా

నలుగురు నిందితులను 8 రోజులపాటు విచారించనున్న ఈడీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 11 వందల కోట్ల ఆన్లైన్ బెట్టింగ్ స్కాం లో విచారణ ముమ్మరంగా జరుగుతోంది. నలుగురు నిందితులను 8 రోజుల పాటు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీ లోకి తీసుకుంది. సైబర్ క్రైమ్ పోలీసుల ఆధీనంలో ఉన్న నలుగురు నిందితులను ఇవాళ ఈడీ కస్టడీలోకి తీసుకుంది. అరెస్టు చేసిన వెంటనే నిందితులను విచారిస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 4 రోజుల విచారణ అనంతరం ఇవాళ ఈడీకి అప్పగించారు. నిందితులను బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు.

తాము అమాయకులమని.. తమకు ఏమి తెలియదని,  చైనాకి చెందిన ప్రధాన సూత్రదారులే అంతా చేసారని సీసీస్ పోలీసుల విచారణలో నిందితులు చెబుతున్నట్లు సమాచారం. చైనా కి చెందిన నింగ్ యాంగ్, డింగ్ యాంగ్, లింగ్ లింగ్ యాంగ్, యాన్ హౌ అనే మరో నలుగురు నిందితులు ఈ స్కాంలో ప్రధాన సూత్రదారులని.. వారి ప్రోద్భలంతోనే తాము పనిచేశామని పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. చైనా కి చెందిన ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి తీసుకువచ్చి విచారిస్తే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Latest Updates