రీ వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ : సిటీలో మరో 8 సెంటర్లు

ఇంటర్మీడియట్ 2019 ఫలితాలకు సంబంధించి కీలకమైన ప్రకటన చేసింది బోర్డ్. సబ్జెక్టుల వారీగా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కావాలనుకునేవారు… bie.telangana.gov.in సైట్ లో అప్లై చేసుకోవచ్చని తెలిపింది. TSONLINE ద్వారా నేరుగా వెళ్లి అప్లై చేసుకునేందుకు హైదరాబాద్ లో మరో 8 సెంటర్లను కొత్తగా ఏర్పాటుచేసింది. రీ కౌంటింగ్ కోసం రూ.100, రీవాల్యుయేషన్ కోసం రూ.600 కట్టి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఆన్ లైన్ అప్లికేషన్లలో సమస్యలు రావడంతో… హైదరాబాద్ లో మరో 8 సెంటర్లు ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డ్. హైదరాబాద్ కొత్తగా 4, రంగారెడ్డి జిల్లాలో 2, మేడ్చల్ జిల్లాలో 2 కలిపి మొత్తం 9(8+1) సెంటర్లు ఇపుడు అందుబాటులోకి వచ్చాయి.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

1.జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) ఆఫీస్, మహబూబియా జూనియర్ కాలేజ్, గన్ ఫౌండ్రి

2. MAM జూనియా కాలేజ్ నాంపల్లి

3. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కాచిగూడ

4. ఫలక్ నుమా గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజ్

5. ప్రభుత్వ జూనియర్ కాలేజ్, హయత్ నగర్

6. ప్రభుత్వ జూనియర్ కాలేజ్, శంషాబాద్

7.జిల్లా DIEO ఆఫీస్, మేడ్చల్

8. ప్రభుత్వ జూనియర్ కాలేజ్, కూకట్ పల్లి

Latest Updates