ఆన్‌లైన్ మోసం: గిఫ్ట్ వచ్చిందని చెప్పి.. మహిళ నుంచి రూ.16 ల‌క్ష‌ల చోరీ

హైదరాబాద్‌: గిఫ్ట్ వ‌చ్చింద‌ని చెప్పి హైదరాబాద్‌లోని ముషీరాబాద్ రాంనగర్ కు చెందిన మహిళ నుంచి రూ.16 లక్షలు సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. ఆమెకు గిఫ్ట్ వ‌చ్చింద‌ని చెప్పి, ఆ గిఫ్ట్ ను మీ అడ్ర‌స్ కు పంపాలంటే టాక్స్ చెల్లించాలని చెప్పి న‌మ్మించారు కేటుగాళ్లు. ఆమె నుంచి జీఎస్‌టీ, ఇన్‌క‌మ్ టాక్స్, సేల్స్ టాక్స్, కస్టమ్స్ టాక్స్ పేరుతో ఆన్ లైన్ ద్వారా 16 లక్షలు అకౌంట్లో వేయించుకున్నారు.

అయితే డబ్బులు ఇచ్చినా బహుమతి మాత్రం రాక‌పోవ‌డంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల‌కు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ నేరగాళ్లు మొత్త‌మ్మీద కేవైసీ, ఉద్యోగం, లోన్, లాటరీ పేర్లతో రూ. 18 లక్షలు ఆన్ లైన్ ద్వారా డ్రా చేసుకున్నార‌ని పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తెలిపారు. వారిని త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని తెలిపారు.

Latest Updates