రీచార్జ్ చెయ్యబోతే 64వేలు కొట్టేసిండు

గూగుల్ పే ఫేక్ కస్టమర్ కేర్
నంబర్ తో ట్రాప్
సైబర్ క్రైం పోలీసులను
ఆశ్రయించిన బాధితుడు
హైదరాబాద్,వెలుగు: గూగుల్ పేలో మొబైల్ రీచార్జ్ చేయబోయి ఫేక్ కస్టమర్ కేర్ కు కాల్చేసిన వ్యక్తి సైబర్ క్రిమినల్ వలలో పడ్డాడు.మాసాబ్ ట్యాంక్ కి చెందిన రాజేశ్ ఫొటోగ్రాఫర్. సోమవారం తన స్మార్ట్ ఫోన్ కి లింక్ ఉన్న గూగుల్ పేతో భార్య మొబైల్ కి రూ.200 రీఛార్జ్ చేశాడు. మొబైల్ కి బ్యాలెన్స్ రాకపోవడంతో గూగుల్ పే యాప్ కస్టమర్ కేర్ నంబర్ కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేసి కాల్ చేశాడు.

రీఛార్జ్ చేస్తే తన అమౌంట్ డిడెక్ట్ అయ్యిందని, బ్యాలెన్స్ పడలేదని చెప్పాడు. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల రీచార్జ్ కాలేదని కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి చెప్పాడు. కొన్ని నిమిషాల్లో ట్రాన్జాక్షన్ అవుతుందంటూ ఫేక్ యూపీఐ లింక్ పంపించాడు. రాజేశ్ ఆ లింక్ ఓపెన్ చేయడంతో డీటెయిల్స్ తెలుసుకుని రూ.64 వేలు కొట్టేశాడు. బాధితుడు మంగళవారం కంప్లయింట్ చేసినట్టు సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.

Latest Updates