50 ప్లేట్ల పూరీ ఆర్డర్ ఇచ్చి రూ.25 వేలు కొట్టేసిన్రు

జమ్మికుంట, వెలుగు: 50 ప్లేట్ల పూరీని ఆర్డర్ చేసి ఆన్ లైన్ లో డబ్బులు పంపిస్తానంటూ బాధితుడి అకౌంట్ నుంచి రూ. 25 వేలు అపహరించిన సంఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణంలోని చందన హోటల్ యజమాని మొగిలికి ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తానని, తనకు 50 ప్లేట్ల పూరీ కావాలని, తాను హుజూరాబాద్ నుంచి బయలుదేరుతున్నానని చెప్పాడు. నిజమే అనుకున్న మొగిలి 50 ప్లేట్ల పూరీ తయారుచేసి అదే నంబర్‌కు ఫోన్ చేశాడు. తాను బయలుదేరానని, డబ్బులు ఆన్ లైన్ ద్వా రా పంపిస్తానని ఏటీఎం కార్డు నంబర్ చెప్పాలని అన్నాడు. తనకు ఏటీఎం కార్డు లేదని చెప్పడంతో ఎవరిదైనా వాట్సాప్‌లో పంపించాలని చెప్పడంతో మొగిలి పంపించాడు. ఏటీఎం కార్డు ద్వారా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ చేసిన ఆ వ్యక్తి వచ్చిన మెసేజ్ చెప్పాలని కోరాడు. మొగిలి చెప్పడంతో మరో రెండుసార్లు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ చేసి రూ. 25 వేలు కాజేశాడు. అకౌంట్లో డబ్బులు కట్ అవుతున్న విషయాన్ని గమనించిన ఏటీఎం కార్డు వ్యక్తి మరోసారి వచ్చిన ఓటీపీ చెప్పలేదు . జరుగుతున్న మోసాన్ని గమనించి అతనికి ఫోన్ చేస్తే హిందీలో మాట్లాడాడు. వచ్చిన ఓటీపీ చెబితే డబ్బులు వస్తాయని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో మొగిలి జరిగిన మోసాన్ని వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

For More News..

ధాన్యం మిల్లులో దించుకోలేదని పురుగులమందు తాగిండు

అక్కడ కరోనా మరణాల్లేవ్

ఈసారి బోనాల పండుగ లేనట్లే

50 ఏళ్లు దాటితే.. గండమే

Latest Updates