పెరుగుతున్న ఈ- ఫార్మసీ ఆర్డర్లు..డెలివరీ చేసేటోళ్లే లేరు

ఈ–ఫార్మసీలకు డెలివరీ పార్ట్ నర్  కొరత వెంటాడుతోంది. ఆర్డర్ల వాల్యుమ్‌ ‌పెరిగినప్పటికి వీటి ఆన్‌‌టైమ్‌‌ డెలివరీలలో ఇబ్బందులు పడుతున్నా మని 1ఎంజీ, మెడ్‌లైఫ్‌, నెట్‌మెడ్స్,  ప్రాక్టో, మై ఉపచార్‌ వంటి ఈ–ఫార్మసీ లు చెబుతున్నా యి. మరో వైపు సప్లయ్‌‌ చెయిన్‌‌లో అంతరాయం ఉందని,  ఎసెన్యషి ల్‌ మెడిసిన్స్‌ షార్టేజ్‌‌ షార్టే ఏర్ప డుతోందని పేర్కొన్నా యి. కస్టమర్లు పానిక్  బయ్యింగ్‌ ‌చేస్తున్నారని, ప్రిస్క్రిప్షన్‌ ‌కంటే ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు చేస్తున్నారని తెలిపాయి. కాగా ఎసెన్యషి ల్‌ మెడిసిన్స్‌ను లిమిటెడ్‌గా అమ్ముతు న్నామని ఈ కంపెనీలుపేర్కొన్నా యి. కేవలం50 శాతం ఆపరేషనల్‌ కెపాసిటీతో పనిచేస్తున్నామని 1ఎంజీఫౌండర్‌ వికాశ్‌ ‌చౌహాన్‌ ‌అన్నా రు. ఇప్పటి కి కూడా ఎసెన్యషిల్‌ సర్వీసుల ఇంటర్‌స్టేట్‌ , ఇం టర్‌‌సిటీ మూవ్‌‌ మెంట్స్‌‌పై నియంత్రణలు ఉన్నా యని చెప్పారు. మా కెపాసిటీని వచ్చే వారంలోపు 70–80 శాతానికి పెం చుతామని తెలిపా రు. డెలివరీ పార్ట్ నర్ల కొరత ఉందని చౌహాన్‌‌ అన్నారు. సుమారు 20–30 శాతం మేర మాత్రమే డెలివరీ వర్క్‌ఫోర్స్‌‌అందుబాటులో ఉందని చెప్పారు.ఆర్డర్లు డబుల్‌ అయ్యాయని కానీ కేవలం50 శాతం డెలివరీలను మాత్రం ఆన్‌‌టైమ్‌‌లో చేయగలుగుతున్నామని అన్నా రు. ఇబ్బంది పెడుతున్న స్టాఫ్‌‌ కొరత.. మెట్రో సిటీలలో మాత్రమే ప్రస్తుతం పనిచేస్తు న్నామని మెడ్‌లైఫ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూ టివ్‌‌ అనంత్‌‌ నారయణన్‌‌ అన్నా రు. మా డెలివరీ పారన్ట ర్లు తిరిగి వర్క్‌‌లో జాయిన్‌‌ అయితే నాన్‌‌ మెట్రోలలో కూడా తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.

లాక్‌డౌన్‌‌ ప్రారంభంలో మా స్టాఫ్‌ ను పోలీసులు, అధికారులు ఇబ్బందులకు గురిచేశారని మై ఉప్చార్‌ పేర్కొంది.దీంతో చాలా మంది తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారని  తెలిపింది. సీనియర్‌ మేనేజ్‌‌మెంట్‌ కోరడంతో ఇప్పుడిప్పుడే తిరిగి వర్క్‌‌లో జాయిన్‌‌ అవుతున్నా రని తెలిపింది. మై ఉప్చార్‌ ఢిల్లీ, లక్నో సిటీలలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఢిల్లీలో 75 శాతం వరకు స్టాఫ్‌ తిరిగి వర్క్‌‌లో జాయిన్‌‌ అయ్యిందని, లక్నోలో కేవలం 30 శాతం మంది వర్క్‌‌లో జాయిన్‌‌ అయ్యారని మై ఉప్చార్‌ సీఈఓ రజత్‌‌గార్గ్‌ అన్నారు. ఈ-ఫార్మసీలకు సప్లయ్‌‌ కొరత నేషనల్ లాక్ డౌన్ వలన ఫార్మా సప్లయ్‌ చెయిన్‌‌లో అంతరాయం ఏర్పడుతోంది. మాన్యు ఫ్యాక్చరింగ్ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు తమ కార్యకలాపాలను తగ్గించేయ డంతో ఈ-ఫార్మశీలకు సప్లయ్‌‌ కొరత ఏర్పడుతోంది. సప్లయ్‌ షార్టేజ్‌ ఉండడంతో ఈ-ఫార్మసీలు ఇబ్బందులు పడుతున్నాయని వికాశ్‌చౌహాన్‌‌ అన్నారు. డిస్ట్రిబ్యూటర్స్‌‌లలోచాలా మంది తమ కార్యకలాపాలను షట్‌డౌన్‌‌ చేశారని చెప్పారు. టైర్‌‌‌‌1,టైర్‌‌‌‌2 సిటీలలో ఎసెన్షియల్‌‌ మెడిసిన్స్‌‌ షార్టేజ్‌ఎక్కువగా ఉందనిగార్గ్‌‌ అన్నారు. ప్రిస్క్రిప్షన్‌‌ లిమిట్‌కు మించికస్టమర్లు ఆర్డర్లు చేస్తున్నా రని, అందుకే కస్టమర్ల ఆర్డర్‌‌‌‌లకు పరిమితంగా సప్లయ్‌ చేస్తున్నా మని మైఉప్చార్‌‌‌‌ తెలిపింది. ఫార్మా డిస్ట్రిబ్యూటర్లు ,మాన్యుఫ్యాక్చరర్లు కూడా లాక్‌డౌన్‌‌ వలన సప్లయ్‌‌ కొరతను ఎదుర్కొంటున్నా రు.

Latest Updates