రాజన్న ఆలయంలో ఆన్‌లైన్ పూజలు

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నుంచి ఆన్‌లైన్ పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అభిషేకం, అన్నపూజ, బిల్వార్చన, కుంకుమ పూజ, నిత్య కల్యాణం, మహా లింగార్చన, సత్యనారాయణ వ్రతం, భీమేశ్వర ఆలయంలో అభిషేకం, నవగ్రహ పూజను T APP FOLIO ద్వారా బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.
గోత్రనామాలతో పూజ చేస్తారని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

 

Latest Updates