కరోనాకు ఆన్‌లైన్‌లో ట్రీట్‌మెంట్

పేషెంట్స్‌కు ఫోన్‌లోనే సూచనలు

ట్రీట్‌మెంట్ ఎమర్జెన్సీ అయితేనే హాస్పిటల్స్​కు రండి

నార్మల్​ ఫీవర్, జలుబు, దగ్గు అయితే వద్దంటున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో డాక్టర్స్ డ్యూటీ మరింత టఫ్​గా మారుతోంది. ఎమర్జెన్సీ అయితేనే హాస్పిటల్స్​కు రావాలని కోరుతున్నారు. నార్మల్​ఫీవర్, దగ్గు, జలుబు ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదిస్తే వీడియో కాల్​లో ట్రీట్​మెంట్​ వివరాలు అందిస్తామని చెబుతున్నారు.

స్ప్రెడింగ్ వెరీ డేంజర్

మన దేశంలో స్టేజ్ 2 ట్రాన్సెషన్ నుంచి  కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి.  ఇది దేశానికి ఉన్న స్ట్రెంత్ ఎఫెక్టివ్ స్క్రీనింగ్. కానీ సెగ్రిగేషన్ లేదని డాక్టర్స్ చెబుతున్నారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారికి స్క్రీనింగ్ చేశాక మైల్డ్, మోడరేటర్, సీవియర్ ఎంత అనేది తెలుస్తుందంటున్నారు. మైల్డ్ 80%, మోడరేటర్ 16%, సీవియర్ 4% ఉంటుందని చెబుతున్నారు. ఈ సిమ్​టమ్స్​ ఉన్న వారిని ఏవిధంగా సెగ్రిగ్రేట్ చేస్తున్నామనే దానితో పాటు,14 రోజులు ఏ రకంగా ఫాలోఅప్ చేస్తున్నాం, హెల్ప్ లైన్స్ ఏం చేస్తున్నాయి, ఎంతమంది డాక్టర్లు అవైలబుల్​లో ఉన్నారనేది ముఖ్యమంటున్నారు. ప్రస్తుతం ఓన్లీ ఎమర్జెన్సీ కేసులనే తీసుకుంటున్నట్లు చెప్పారు. పేషెంట్స్ కి మినిమమ్​ చెక్ అప్, ఫాలో అప్ చెకప్ ఉంటే డాక్టర్స్ వాట్సాప్ కన్సెల్టేషన్ లో సూచనలు ఇస్తున్నారు. ఆన్​లైన్ లో 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. హై ప్రొటీన్ డైట్, ఇమ్యూన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ, ఎక్కడికి వెళ్లినా ఎన్95 మాస్క్ లు వాడుతున్నారు. అవి అందుబాటులో లేకపోతే సర్జికల్ మాస్క్ లు వేసుకుంటున్నట్లు డాక్టర్స్ చెబుతున్నారు.

హై ప్రికాషన్స్

ఉదయం నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్ లోనే ఉంటున్న డాక్టర్లు డ్యూటీ అయ్యాక అప్పటివరకు యూజ్ చేసిన డ్రెస్ చేంజ్​ చేసుకొని, కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నారు. కార్ హ్యాండిల్స్ కూడా శానిటైజ్ చేస్తున్నారు. పిల్లలను ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు జూనియర్ డాక్టర్స్ 24  గంటలు హాస్పిటల్స్ లోనే ఉండాల్సి వస్తోంది. వాళ్లు పూర్తి స్థాయిలో ప్రికాషన్స్ తీసుకుంటున్నారు.

జనరల్​చెకప్​కు రావద్దు

కండిషన్​ ఏదైనా మన పని మనం కంటిన్యూ  చేస్తూనే కేర్​ఫుల్ గా ఉండాలి. చాలావరకు ఫోన్ లోనే ట్రీట్​మెంట్ ఇస్తున్నాం. ఎమర్జెన్సీ అయితేనే హాస్పిటల్​కి రమ్మంటున్నాం.  ఫారెన్​ నుంచి వచ్చిన వారెవరైనా ఉంటే బేసిక్  ​, సిమ్టమా టిక్ ట్రీట్​మెంట్​ తీసుకుంటే సరిపోతుంది. 97శాతం ప్రజలకు కరోనా పాజిటి వ్ ఉన్నా కూడా వాళ్లకి మందులు అవసరం లేదు. ఇంట్లో ఐసోలేషన్ పెట్టు కుంటూ సిమ్టమాటిక్ ట్రీట్​మెంట్​ తీసుకుంటే సరిపోతుంది. 3% మందికే నిమోనియా, డ్రెస్పెరేటివ్ ప్రాబ్లమ్స్ వచ్చే చాన్స్ ఉంది.  జలుబు, దగ్గు, ఫీవర్ ఉంటే కరోనా అనే భయం వద్దు. మాకు ఫోన్ చేసి అడిగితే సరిపోతుంది.

– డా.చైతన్య చల్లా(కన్సల్టెంట్ జనరల్ మెడిసన్, కేర్ హాస్పిటల్స్)

పబ్లిక్ ఏరియాల్లో స్క్రీనింగ్ పెట్టాలె

సిటీలోని రెండు ప్లేసెస్లో మాత్రమే ఐసోలేషన్ ఉంది. ఎంతమంది అక్కడికి వెళ్లి ఉండగలరు. ఇప్పుడు వైరస్ కంటే స్ప్రెడ్డింగ్ చాలా డేంజర్. పబ్లిక్ ఏరియాల్లో స్క్రీనింగ్ చేసి కేటగిరీ వైజ్‌గా డివైడ్ చేయాలి. మైల్డ్, మోడరేట్ ఉన్నవాళ్ల కోసం అక్కడే ఒక ఫిజిషియన్ కౌంటర్ అవసరం. ప్రికాషన్స్ తీసుకుని డెలివరీ చేస్తున్నాం. ఆంటిమెటల్ మదర్‌కి కూడా స్క్రీనింగ్ చేసి మమ్మల్ని మేము కూడా ప్రొటెక్ట్ చేసుకుంటాం.
– డా. కావ్య (కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, కేర్ హాస్పిటల్)

హై అలర్డ్ సిట్యువేషన్
రెగ్యులర్ డేస్ తో పోలిస్తే హై అలర్ట్ సిట్యువేషన్‌లో ఉన్నాం. 8 నుంచి 12 గంటలు హాస్పిటల్‌లోనే ఉంటున్నాం. కోవిడ్ 19 ఉన్న పేషెంట్స్కి అయినా, నార్మల్ పేషెంట్స్‌కి అయినా ట్రీట్‌మెంట్ చేసేప్పుడు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విమెంట్‌తోనే వెళ్తాం . హాస్పిటల్ నుంచి వెళ్లాక ఎవరినీ టచ్ చేయకుండా బాడీ, హాస్పిటల్ క్లాత్స్ వాష్ చేసి ఆ తర్వాతే ఇంట్లో వాళ్లని కలుస్తాను. ఇప్పటివరకు వచ్చిన సస్పెక్టెడ్ కేసులను గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన జోనల్ హాస్పిటల్‌కి రిఫర్ చేశాం.
– డా. ప్రసాద్ (ఇంటెన్సివిస్ట్, అపోలో డీఆర్డీఓ)

For More News..

కరోనా కట్టడికి సినీనటుల భారీ సాయం

అద్దె ఇంటి ఓనర్లకు సర్కారు వార్నింగ్

కరోనాకు విరుగుడు పేషంట్ల రక్తమే

Latest Updates