ఆ రైలులో అంతా అతివలే..

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మహిళా సాధికారత, జెండర్‌‌‌‌ ఈక్వాలిటీ చాటడానికి భారతీయ రైల్వే ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు ‘ఈచ్‌‌‌‌ ఫర్‌‌‌‌ ఈక్వల్‌‌‌‌’ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దక్షిణమధ్య రైల్వే అధికారులు శనివారం సికింద్రాబాద్‌‌‌‌–వికారాబాద్‌‌‌‌ మధ్య ప్యాసింజర్‌‌‌‌ రైలును మహిళా ఉద్యోగులతోనే నడిపించారు. లోకో పైలట్‌‌‌‌ దగ్గర నుంచి టీటీ, గార్డు, ఆర్పీఎఫ్‌‌‌‌ సిబ్బంది, స్వీపింగ్‌‌‌‌ వరకూ అంతా మహిళలే ఉంటారు. సికింద్రాబాద్‌‌‌‌లో జెండా ఊపి దీన్ని ప్రారంభించింది కూడా మహిళా ఉద్యోగులే. ఇప్పటికే దక్షిణమధ్య రైల్వే పరిధిలో 5 మహిళా రైల్వే స్టేషన్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మహిళా ఉద్యోగులను దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్‌‌‌‌ మాల్యా అభినందించారు.

For More News..

ఇంటర్ ఇంగ్లిష్‌లో 5 తప్పులు.. ఆ తప్పులు ఇవే..

ఇంటికో ఉద్యోగం ఇస్తమని నేను ఎప్పుడూ అనలేదు