ఢిల్లీ ప్రజల మధ్యే కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం

ఈ నెల 16న( ఆదివారం)  ఢిల్లీలోని ప్రఖ్యాత రామ్ లీలా మైదాన్ వేదికగా అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం చేయడం ఇది మూడోసారి. అయితే ఈ సారి ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి రాజకీయ హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా జరుపుకోవాలని అనుకున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాలకు చెందిన సీఎంలు, రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానం పంపడం లేదు. తనపై నమ్మకంతో మళ్లీ అధికారం కట్టబెట్టిన ఢిల్లీ ప్రజల మధ్యే సీఎంగా ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు కేజ్రీవాల్.

Latest Updates