రాణిగంజ్ డిపోలోకి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు మాత్రమే

హైదరాబాద్: లేబర్ కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఆర్టీసీ కార్మికలను విధుల్లో చేర్చుకోమని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ చెప్పారు. అయినప్పటికీ.. కార్మికులు మాత్రం విధుల్లో చేరేందుకు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే డిపోల వద్దకు క్యూ కడుతున్నారు. రాణిగంజ్ డిపో వద్దకు వచ్చిన రెగ్యులర్ కార్మికులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. డిపోలోకి తాత్కాలిక డ్రైవర్లు, తాత్కాలిక కండక్టర్లను మాత్రమే అనుమతిస్తున్నారు. వాళ్లను కూడా చెక్ చేసి మరీ లోపలికి పంపిస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, తాత్కాలిక కండక్టర్లు మాత్రమే బస్సులను డిపో నుంచి బయటకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Latest Updates