ఇండియాలో తొలి ఆఫీసును ప్రారంభించిన ఆన్‌ప్యాసివ్

నగరంలో ఆన్‌‌ప్యాసివ్ హెడ్‌ ఆఫీసు ఇండియాలో ఫస్ట్ ఆఫీసు ఇదే

హైదరాబాద్, వెలుగు: ఇంటెలిజెంట్ బిజినెస్ ఆటోమేషన్ సర్వీసెస్ ప్రొవైడర్ ఆన్‌‌ప్యాసివ్ ఇండియాలో తన తొలి ఫెసిలిటీని నగరంలో ఏర్పాటు చేసింది. ఈ కొత్త ఫెసిలిటీలో ప్రస్తుతం 380 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2021 నాటికి ఎంప్లాయీ సంఖ్యను వెయ్యికి పైగా పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త క్యాంపస్ ఇండియాలో ఆన్‌‌ప్యాసివ్ హెడ్ ఆఫీసు అని కంపెనీ సీఈవో ఆష్ ముఫరేహ్ చెప్పారు. వచ్చే కొన్నేళ్లలో తమ ఆఫీసులను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్‌‌లకు ఆన్‌‌ప్యాసివ్ ఏఐ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ సొల్యూషన్స్‌‌ను అందిస్తోంది. తాము యునికార్న్‌‌గా కూడా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ చెప్పింది. రెండేళ్ల నుంచి ఆన్‌‌ప్యాసివ్ బెంగళూరులో బ్యాక్‌ ఎండ్ వర్క్ చేసింది. ప్రస్తుతం ఫుల్‌ ప్లెడ్జ్ సేవలను అందించేందుకు హైదరాబాద్‌‌లో హెడ్‌‌ ఆఫీసును ఏర్పాటు చేసింది.

For More News..

జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లుగా నిలిచి గెలిచిన భార్యభర్తలు

మధ్యప్రదేశ్‌లో మార్చి 31 వరకు స్కూల్స్ బంద్

స్వీపర్లు లేక టీచర్లే స్కూల్స్ క్లీనింగ్ చేసుకుంటున్నరు

Latest Updates