అమెరికాలో మరోసారి కాల్పులు

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కొలరాడో రాష్ట్రం డెన్వర్ ఏరియాలోని లోని  కొలరాడో సైన్స్ అండ్ టెక్నాలజీ స్కూల్ లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. వీరిని దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాల్పులు జరిపింది తోటి విద్యార్థులేనని అనుమానిస్తున్నారు పోలీసులు.  కాల్పులు జరిపిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరొకతను కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు.

Latest Updates