నవంబర్ లో ఓపెన్​ వర్సిటీ పీజీ పరీక్షలు

హైదరాబాద్​, వెలుగు: డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ ఓపెన్​ యూనివర్సిటీ పీజీ పరీక్షలు వచ్చే నెల 19 నుంచి నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎంఏ, ఎమ్​కాం, ఎంఎస్సీ, బ్యాచిలర్​ ఆఫ్​ లైబ్రరీ అండ్​ ఇన్ఫర్మేషన్​ సైన్స్​, ఎంబీఏ, మాస్టర్​ ఆఫ్​ లైబ్రరీ అండ్​ ఇన్ఫర్మేషన్​ సైన్స్​, ఇతర సర్టిఫికేట్‌‌ కోర్సులకు  సంబంధించిన పరీక్షలు ఉంటాయని చెప్పారు. విద్యార్థులు వర్సిటీ వెబ్​సైట్​ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఈ నెల 25లోగా రిజిస్ర్టేషన్​ చేసుకోవాలని సూచించారు. పరీక్షలకు రెండు రోజుల ముందు వర్సిటీ వెబ్​సైట్​లో హాల్​టికెట్లు డౌన్​లోడ్​ చేసుకోవచ్చన్నారు.

Latest Updates