హోర్డింగుల్లో దర్శనమివ్వనున్న అత్యాచార, ఈవ్ టీజింగ్ నిందితుల ఫోటోలు

ఇకపై అత్యాచారం, ఈవ్ టీజింగ్ పాల్పడ్డ నిందితుల ఫోటోలు రోడ్లకు ఇరువైపులా ఫ్లెక్సీల రూపంలో దర్శనమివ్వబోతున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అత్యాచారం, ఈవ్ టీజింగ్ పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు తీసుకోనుంది. ఆపరేషన్ దురాచారి పేరుతో గతంలో లైంగిక వేదింపులకు పాల్పడ్డ నిందితులతో పాటు ఇకపై రాష్ట్రంలో లైంగిక వేదింపులకు పాల్పడ్డ నిందితుల వివరాల్ని సేకరించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారుల్ని ఆదేశించారు.

మహిళలపై లైంగిక వేదింపులకు పాల్పడిన నిందితుల పేర్లను బహిర్ఘతం చేసి, వారు సిగ్గుపడేలా బుద్ధి చెప్పాలనే ఈ పోస్టర్ కార్యక్రమాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Latest Updates