మార్కెట్లోకి ఒప్పో F15.. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా

  • 48 ఎంపీ బ్యాక్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • జనవరి 16 న అందుబాటులోకి

హైదరాబాద్‌‌, వెలుగు: చైనా స్మార్ట్‌‌ఫోన్‌‌ కంపెనీ‌‌  ఒప్పో,  తన లేటెస్ట్‌‌ మోడల్‌‌ ఎఫ్‌‌15 ను ఈ నెల 16 నుంచి అందుబాటులోకి  తీసుకురానుంది. ఎఫ్‌‌ సిరీస్‌‌తో పాపులరైన  ఒప్పో, మరో కొత్త మోడల్‌‌తో కస్టమర్ల ముందుకు రాబోతోందని హైదరాబాద్‌‌లో జరిగిన ఎఫ్‌‌15 ప్రి లాంఛ్‌‌ ఈవెంట్‌‌లో కంపెనీ ప్రొడెక్ట్‌‌ మేనేజర్‌‌‌‌ రిషబ్‌‌ శ్రీ వాస్తవ వెల్లడించారు. ఈ స్మార్ట్‌‌ఫోన్‌‌కు వెనుక నాలుగు కెమెరాలుంటాయి.  వీటితో అత్యున్నత నాణ్యత కలిగిన ఫొటోలను తీసుకోవచ్చని ఒప్పో తెలిపింది. తక్కువ వెలుతురులోనూ ఫొటోలు బాగా వస్తాయని కంపెనీ సీనియర్​ ఆఫీసర్​ ఒకరు తెలిపారు.

సెల్ఫీల కోసం ఇందులో 16 ఎంపీ కెమెరా ఉంటుంది. 8 జీబీ ర్యామ్‌‌, 128 జీబీ ఇంటర్నల్‌‌ స్టోరేజీ ఉన్న ఈ మొబైల్‌‌,  లైటింగ్‌‌ బ్లాక్‌‌, యూనికార్న్‌‌ వైట్‌‌ రెండు కలర్స్‌‌లలో అందుబాటులోకి రానుంది. ఒప్పోకు తెలంగాణలో 18 సర్వీస్‌‌ సెంటర్లున్నాయి. ఇందులో  హైదరాబాద్‌‌లోనే  నాలుగు సెంటర్లున్నాయి.  2018 లో హైదరాబాద్‌‌లో ఆర్‌‌‌‌ అండ్‌‌ డీ  సెంటర్‌‌‌‌ను ఒప్పో ఏర్పాటు చేసిందని శ్రీ వాస్తవ తెలిపారు. హైదరాబాద్‌‌లో  ఒప్పో అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన(అక్టోబర్‌‌‌‌ 2019 నాటికి) 57.01 శాతం పెరిగాయన్నారు.  ప్రస్తుతం ఇండియన్ స్మార్ట్‌‌ఫోన్‌‌ మార్కెట్‌‌లో ఒప్పో బ్రాండ్‌‌కు 12.4 శాతం  మార్కెట్‌‌ వాటా ఉంది.

ఒప్పో ఎఫ్‌‌ 15లో  4,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ, ఫింగర్‌‌‌‌ ప్రింట్‌‌ 3.0 సెన్సర్‌‌, ‌‌వూక్‌‌ 3.0 ఫ్లాష్‌‌ చార్జ్‌‌ ఫిచర్లున్నాయి.  డ్యూయల్‌‌ సిమ్‌‌ కార్డుతోపాటు 256 జీబీ ఎక్స్‌‌పాండబుల్‌‌ మెమొరీ కార్డు స్లాట్ ఈ మొబైల్‌‌లో ఉన్నాయి. మొబైల్‌‌ బరువు 172 గ్రా., ఎఫ్‌‌హెచ్‌‌డీ+అమోలెడ్‌‌ స్క్రీన్‌‌, గొరిల్లా గ్లాస్‌‌ 5 దీని సొంతం. ఎఫ్‌‌ 15  మీడియా టెక్‌‌  పీ70 ప్రాసెసర్​తో పాటు 6.4 ఇంచెస్‌‌ టచ్‌‌ స్క్రీన్‌‌, గేమ్‌‌ బూస్టర్‌‌‌‌ 2.0 ఫీచర్లతో అందుబాటులోకి వస్తోంది.  మొబైల్‌‌ ధరను మాత్రం కంపెనీ ఇంకా  ప్రకటించలేదు.

Latest Updates