రెనో 2 సిరీస్ స్మార్ట్ ఫోన్లు వచ్చాయ్

oppo-reno-2-series-smartphones-launched-in-india

న్యూఢిల్లీ : ఒప్పో రెనో2 సిరీస్‌‌ స్మార్ట్‌‌ఫోన్లను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌‌ఫోన్లు రెనో2, రెన్ 2ఎఫ్, రెనో 2జెడ్ పేర్లతో మార్కెట్‌‌లోకి వచ్చాయి. రెనో 2 ధర రూ.36,990గా, రెనో 2జెడ్ ధర రూ.29,990గా ఉంది. రెనో 2ఎఫ్ ధరను కంపెనీ వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌‌ఫోన్ల లాంచ్‌‌తో ఇండియాలోని మార్కెట్ షేరును 10 శాతానికి పైగా పెంచుకోవాలని చూస్తున్నట్టు కంపెనీ ఉన్నతాధికారులు చెప్పారు. రెనో2 సిరీస్ స్మార్ట్‌‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తొలి దేశం ఇండియానేనని ఒప్పో ఇండియా ప్రొడక్ట్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సుమిత్ వాలియా అన్నారు. కరెక్ట్‌‌గా ఫెస్టివల్ సీజన్‌‌ ముందు తాము ఈ ప్రొడక్ట్‌‌లను తీసుకొచ్చినట్టు చెప్పారు. తమ ప్రొడక్ట్‌‌లు 60 వేల అవుట్‌‌లెట్లలో లభిస్తాయని తెలిపారు. రెనో 2 సిరీస్ స్మార్ట్‌‌ఫోన్లు 8జీబీ+256జీబీ స్టోరేజీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఈ మోడల్స్ లాంచింగ్‌‌తో అదనంగా 2 శాతం నుంచి 3 శాతం మార్కెట్ షేరును పెంచుకోవాలని చూస్తున్నట్టు వాలియా చెప్పారు.

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. ఒప్పోకు 2019 ఏప్రిల్–జూన్ క్వార్టర్‌‌‌‌ ముగిసే నాటికి 8 శాతం మార్కెట్ షేరు ఉంది. స్మార్ట్‌‌ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు యూజర్లు ఎక్కువగా కెమెరానే అత్యంత ముఖ్యమైన ఫీచర్‌‌‌‌గా చూస్తున్నారని వాలియా అన్నారు. కెమెరాను బట్టి ఫోన్ తీసుకుంటున్నారని చెప్పారు. కంపెనీ తొలిసారి మార్కెట్‌‌లోకి తెచ్చిన రెనో సిరీస్ స్మార్ట్‌‌ఫోన్‌‌కు ఇండియన్ మార్కెట్‌‌ నుంచి మంచి స్పందన వచ్చినట్టు పేర్కొన్నారు. నెలలోనే మరో రెండు నుంచి మూడు మోడల్స్‌‌ను మార్కెట్‌‌లోకి లాంచ్ చేస్తామని ప్రకటించారు. అన్ని కన్స్యూమర్ సెగ్మెంట్లకు ఈ డివైజ్‌‌లు అందుబాటులో ఉంటాయి. ఇండియాలో ప్రొడక్షన్ కెపాసిటీని 2020 నాటికి రెండింతలు చేసేందుకు ఒప్పో తన స్మార్ట్‌‌ఫోన్ మానుఫాక్చరింగ్ యూనిట్‌‌ను విస్తరిస్తోంది.

Latest Updates