EVM, వీవీప్యాట్లపై ముంబైలో పార్టీల చర్చ

EVM, వీవీ ప్యాట్లపై చర్చించేందుకు ఇవాళ ముంబైలో రాజకీయ పార్టీలు సమావేశం అవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా… దేశంలోని పలు పార్టీల ప్రతినిధులు ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరవుతున్నారు. రాష్ట్రం నుంచి తెలంగాణ జనసమితి అధినేత ప్రొ.కోదండరామ్ పాల్గొంటున్నారు.

ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్ల పనితీరుపై విపక్షాలు ఇప్పటికే అభ్యంతరాలు తెలిపాయి. పలుమార్లు ఈసీని కలిశాయి. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశాయి. 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలనేది ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్. ఇటీవల అపోజిషన్ పార్టీలు వేసిన ఓ పిటిషన్ స్పందించిన సుప్రీంకోర్టు… సగటున నియోజకవర్గానికి ఒక వీవీ ప్యాట్ కాకుండా ఐదు వీవీప్యాట్ బాక్సుల్లోని స్లిప్పులను లెక్కించాలని తీర్పుచెప్పింది. ఇవాళ్టి సమావేశంలో చర్చించి తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నాయి అపోజిషన్ పార్టీలు.

 

Latest Updates