ప్రభుత్వాలపై అణచివేత ఆపాలంటూ విపక్షాల నిరసన

రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అణగదొక్కుతోందని ఆరోపిస్తూ.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. తృణమూల్, RJD, CPI, NCP, సమాజ్ వాదీ ఎంపీలు  కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ఏతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. అక్కడి ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని ఎంపీలు ఆరోపించారు. విపక్ష సభ్యుల ఆందోళనకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మద్దతు తెలిపారు.

Latest Updates