హైదరాబాద్ లో ఒరాకిల్ రెండో డేటా సెంటర్

న్యూఢిల్లీ : ఒరాకిల్ ఇండియాలో తన రెండో డేటా సెంటర్‌‌‌‌ను హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేసింది. గతేడాది తొలి డేటా సెంటర్‌‌‌‌ను ముంబైలో ఏర్పాటు చేసిన ఒరాకిల్, ఆ తర్వాత వెంటనే  ఈ రెండో సెంటర్‌‌‌‌ను లాంఛ్ చేసింది. ఈ ఏడాది చివరికల్లా 36 సెకండ్ జనరేషన్ క్లౌడ్ రీజియన్లను ఆపరేట్ చేయాలని ఒరాకిల్ లక్ష్యంగా పెట్టుకుంది.ఇందులో భాగంగానే దీన్ని ఏర్పాటు చేసింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్‌‌లలో కూడా ఈ సెంటర్లను ప్రారంభించనుంది. ప్రస్తుతం, కొత్త క్లయింట్స్ నుంచి క్లౌడ్ సర్వీ స్‌ ల కోసం డిమాండ్ పెరుగుతోన్న క్రమంలో, ఈ సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేసినట్టు ఒరాకిల్ ఇండియా రీజనల్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేంద్ర కుమార్ తెలిపారు. ఈ రెండు డేటా సెంటర్లు 15 వేలకు పైగా కయింట్లకు సర్వీసులను అందించనున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ లాంటి క్రిటికల్ సర్వీసుల నుంచి డిమాండ్ బాగా వస్తోందని కుమార్ తెలిపారు. కరోనా వల్ల వీటిలో చాలా సర్వీసులను వర్క్ ఫ్రమ్ హోమ్‌ మోడల్‌లో ఆఫర్ చేస్తున్నారని పేర్కొన్నారు.

లేఆఫ్స్ లేవు…

కొంతమంది కస్టమర్లు వారి వర్క్‌‌లోడ్స్‌ను కరోనా కారణంతో కొత్త డేటా సెంటర్‌‌‌‌లోకి షిఫ్ట్ చేస్తున్నారని చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌లో కనెక్టి విటీ అవసరాలు పెరుగుతుండటంతో , టెలికాం రంగం నుంచి కూడా తమ డేటా సెంటర్లకు డిమాండ్ వస్తుందని తెలిపారు. కస్టమర్లకు ఎలాంటి అవాంతరాలు లేని సర్వీసులు అందజేసేం దుకు టెలికాం కంపెనీలన్నింటితో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. ఒరాకిల్ ఇండియాలో లే ఆఫ్స్‌ పై స్పందించిన కుమార్, అలాంటి ప్లాన్స్ ఏమీలేవని తెలిపారు. తాము కొత్త ఉద్యోగాలు ఇస్తున్నట్లు కుమార్ పేర్కొన్నారు.

Latest Updates